Natyashastra Verse 17
admin
Jun 24
జగ్రాహ పాఠ్యమృగ్వేదాత్సామభ్యో గీతమేవ చ । యజుర్వేదాదభినయాన్ రసానాథర్వణాదపి ॥
తాత్పర్యం:
బ్రహ్మదేవుడు ఋగ్వేదం నుండి పాఠ్యాన్ని (సంభాషణ), సామవేదం నుండి గీతాన్ని (సంగీతం), యజుర్వేదం నుండి అభినయాన్ని (నటన), మరియు అథర్వణ వేదం నుండి రసాన్ని (భావాలు) గ్రహించారు.
వివరణ:
సినిమాకైనా, నాటకానికైనా ఈ నాలుగు మూలస్తంభాలే ప్రధానమైనవి.
- ఋగ్వేదం నుండి పాఠ్యం
- సామవేదం నుండి గీతం
- యజుర్వేదం నుండి అభినయం
మరియు అథర్వవేదం నుండి రసం స్వీకరించబడ్డాయి.
ఈ నాలుగు కలిసినప్పుడే అది సంపూర్ణమైన కృతి అవుతుంది.

