Natyashastra Verse 15
admin
Jun 24
సర్వశాస్త్రార్థసంపన్నం సర్వశిల్పప్రవర్తకమ్ । నాట్యాఖ్యం పంచమం వేదం సేతిహాసం కరోమ్యహమ్ ॥
తాత్పర్యం:
“సకల శాస్త్రాల యొక్క అర్థంతో నిండినది, అన్ని శిల్పకళలకు, నైపుణ్యాలకు మూలమైనది, ఇతిహాసంతో (చరిత్రతో) కూడినదైన ‘నాట్యం’ అనే ఐదవ వేదాన్ని నేను సృష్టిస్తున్నాను” అని బ్రహ్మ ప్రకటించారు.
వివరణ:
నాట్యం అనేది ఏకాంత కళ కాదు. ఇందులో చిత్రలేఖనం ఉంటుంది, వాస్తు శాస్త్రం ఉంటుంది, మనస్తత్వశాస్త్రం ఉంటుంది, వృత్తాంతము/చరిత్ర ఉంటుంది. అన్ని రకాల కళలు మరియు శాస్త్రాలనుతనలో ఇముడ్చుకోగల ఏకైక మాధ్యమం నాట్యమేనని బ్రహ్మ ఇక్కడ స్పష్టం చేస్తున్నార.

